కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కాలభైరవ స్వామిని దర్శించాలి. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి కాశీవిశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన భైరవునితో శివుడు ‘‘ నీవు ఇక్కడే ఉండిపో ’’ అని చెప్పగా, భైరవుడు శివుని ఆజ్ఞను శిరసావహించి అక్కడే ఉండి పోయాడు అని చెబుతుంటారు. కనుక కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కాశీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణదేవిని ధర్శంచి తప్పక కాలభైరవస్వామిని కూడా దర్శించాలి. శివుడి పై భక్తి ఉన్నప్పటికీ, కాలభైరవవుని పై భక్తి విశ్వాసాలు లేనివారికి విఘ్నాలు కలుగక తప్పవు, కనుక కాలభైరవుని ఆరాధించి సర్వవిఘ్నాలను తొలగించుకుని మంచి ఫలితాన్ని పొందవలేను. మార్గశిర శుక్ల అష్టమి నాడు కాలభైరవుణ్ణి పూజించి ఉపపాపాల నుండి విముక్తిని పొందవచ్చును. ఈ రోజున భైరవవూజ చేసినట్లయితే ఆ సంవత్సరమంతా ఏ పనులను ప్రారంభించినా అవినిర్విఘ్నంగా పూర్తవుతాయి. కాలభైరవ తీర్థంలో స్నానమాచరించి పితృతర్పణాలు వదిలితే, పితృదేవతలు సంతుష్టులవుతారు. అలాగే భైరవునికి ప్రతినిత్యం ఎనిమిది ప్రధక్షిణలు చేస్తూ ఉంటే వారికి ఎటువంటి పాపాలు అంటవు. ఆరునెలలు భైరవుని సన్నిధిలో జపం చేస్తే మంత్రసిధ్ధి కలుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: